శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిని ఏపీ సీఎం జగన్ కలిశారు. విజయవాడలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రయంలో ఆయనను సీఎం జగన్ కలిశారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా పోలేదని.. భయంతోనే చాలా మంది ప్రజలు చనిపోయారని తెలిపారు. కరోనా నిబంధనలను అందరూ పాటించాలని… కరోనా పోవాలని , ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారికి ప్రార్థనలు చేశామన్నారు.
దేవాలయాల్లో ప్రసాదాలు రుచిగా , శుచిగా ఉండేలా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారని.. రాష్ట్రంలో ఆలయాల భూములు నాశనం కాకూడదని వెల్లడించారు. ఆలయాల భూములు కాపాడాలని సీఎం ను కోరామని.. వంశపారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించాలని కోరానని వెల్లడించారు.
హిందూ విరుద్దంగా ప్రచారం చేస్తున్నారని తనపై దుష్ర్పచారం చేస్తున్నారని సీఎం బాధపడ్డారని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా చూస్తున్నానని సీఎం నాతో చెప్పారని… సీఎం జగన్ చాలా కష్టపడి పైకి వచ్చారని స్పష్టం చేశారు. సీఎంపై, హిందుత్వానికి విరుద్దంగా ప్రచారం జరగకూడదని కోరుతూ నేను దేవున్ని ప్రార్థిస్తానని… రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచన సీఎం జగన్ కు ఉందని చెప్పారు. ప్రజలు అందరూ స్వచ్చందంగా ప్రజా సేవ చేయాలన్నారు.