పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మరోమారు కలువనున్నారు. ఈనెలలో ఇప్పటికి ఇది మూడో భేటీ కావడం ప్రాదాన్యతను సంతరించుకుంది. తాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పంజాబ్ కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారనున్నాయి. గత నెల సీఎంగా అమరీందర్ ను తప్పించి కొత్తగా చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూకు అమరీందర్ సింగ్ కు పొసగడం లేదు. వీరిద్దరు బహిరంగంగానే విమర్శించుకున్నారు. అప్పటి నుంచి అమరీందర్ కు కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో ఉండబోనని అమరీందర్ తెగేసి చెప్పారు. ప్రస్తుతం అమిత్ షాతో కెప్టెన్ భేటీ కావడంతో పంజాబ్ లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ దశలోనే బీజేపీతో పొత్తు వ్యవహారం గురించి చర్చించడానికే అమరీందర్ ఢిల్లీ పర్యటన పెట్టుకన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు రైతు చట్టాలు, రైతుల నిరసనలపై కూడా భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైతుల ఆందోళనపై అందరికి ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని అమరీందర్ కోరనున్నట్లు సమాచారం.