ఏ బ్యాంక్ అకౌంట్ కి మీ ఆధార్ లింక్ అయ్యిందో ఇలా తెలుసుకోండి..!

-

ఆధార్ కార్డు అన్నింటికీ చాలా అవసరం. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, రేషన్ షాపులో సరుకులు తీసుకోవాలన్నా ఆధార్ కావాలి. అలానే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన అకౌంట్లలో పడతాయి. అదే విధంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు చెందిన నిధులు ఆధార్ నెంబర్‌కు లింకైన అకౌంట్లలో పడతాయి. అయితే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరిగా మారిపోయింది.

 

ఒకవేళ కనుక రెండు మూడు బ్యాంకుల్లో అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నవాళ్లు ఉంటే ఏ అకౌంట్ తో ఆధార్ లింక్ అయ్యిందో ఇలా తెలుసుకోచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఈ సేవల్ని అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేశారో చూడచ్చు.

ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
నెక్స్ట్ హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి.
ఇప్పుడు ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి… ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయండి.
ఇప్పుడు మీకు ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిందో వివరాలు కనిపిస్తాయి.
ఒక వేళ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ లేనట్టైతే మీరు మీ అకౌంట్ ఉన్న బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. మీరు ప్రభుత్వ పథకాలకు చెందిన డబ్బుల్ని ఏ అకౌంట్‌ లోకి పొందాలనుకుంటే ఆ అకౌంట్‌కు లింక్ చెయ్యండి.

 

Read more RELATED
Recommended to you

Latest news