Jagapathi: రూట్ మార్చిన జ‌గ్గుబాయి.. అక్క‌డ భారీ ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్!

-

Jagapathi: ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరో జ‌గ‌ప‌తి బాబు.. రీఎంట్రీ త‌రువాత త‌న రూట్ మొత్తం మార్చేశారు. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి.. ప‌వ‌ర్ విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చారు. త‌న వైవిధ్య‌మైనా న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందాడు. దీంతో ఆయ‌నకు వ‌రుస‌గా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. ప్రస్తుతం జగపతి బాబు.. క్యారెక్టర్ ఆర్టీస్ట్‏గా ఫుల్ బిజీ అయ్యాడు.

ఈ త‌రుణంలో జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీకి ఇవ్వ‌డానికి రంగం సిద్దం చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. హిందీ తెరపై న‌టించి మెప్పించాల‌ని భావిస్తున్నారట‌. ఆ ఏంట్రీ కూడా గ్రాండ్ గా ఉండేట్టు చూసుకుంటున్నారు. చారిత్రక చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు అశుతోష్‌ గొవారికర్ తెరకెక్కించనున్న యాక్ష‌న్ థ్రిల‌ర్ పుకార్ అనే చిత్రంతో ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇందులో ఫరాన్‌ అక్తర్‌ ప్రధాన పాత్ర పోషించనున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్ హీరోయిన్ గా నటించ‌నున్న‌ది. ఇందులో విలన్‌గా జగపతిబాబు కనిపించబోతున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. డిసెంబరులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక జగపతి బాబుకి బాలీవుడ్‌లో ఎలాంటి ఎంట్రీ ఇప్పిస్తుందో చూడాలి మరి…

Read more RELATED
Recommended to you

Latest news