బాబు…చినబాబుని అందుకే సైలెంట్ చేశారట!

-

రాజకీయాల్లో ఏ నాయకుడైన సరే..తమ వారసులని సక్సెస్ చేసుకోవాలని చూస్తారు. ఆ విషయంలో చంద్రబాబు కూడా ఏమి అతీతం కాదు…తన తనయుడు లోకేష్‌ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారో చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే లోకేష్‌కు బోలెడు అవకాశాలు ఇచ్చారు. కానీ రాజకీయంగా లోకేష్ సరిగా నిలబడలేకపోయారు. పైగా పప్పు అని ముద్రవేయించుకున్నారు. అలాగే గత ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలయ్యారు.

అయితే ఒక్క ఓటమి లోకేష్ రాజకీయ భవిష్యత్‌ని మార్చేసింది. రాజకీయంగా లోకేష్‌లో చాలా మార్పు వచ్చింది…దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. వయసు మీద పడుతుండటంతో చంద్రబాబు కూడా ఇంటికే పరిమితమై…చినబాబుని ప్రజల్లోకి వదిలారు. ఈ క్రమంలోనే చాలా వరకు చినబాబు పరిణితి చెందిన నాయకుడుగా మారిపోయారు. పప్పు అనే పదం కూడా పోగొట్టుకున్నారు.

కానీ ఎంత చేసినా ఎక్కడో లోపం కనిపిస్తోంది….అనుకున్న మేర లోకేష్‌కు ప్రజల నుంచి ఆదరణ రావడం లేదు. ఇంకా లోకేష్‌కు ఎదగడానికి సమయం ఉందనే తెలుస్తోంది. పైగా లోకేష్ హైలైట్ అయితే…నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనే సి‌ఎం అభ్యర్ధి అనుకునే అవకాశం ఉంది. అప్పుడు టి‌డి‌పికి ప్రజా మద్ధతు ఇంకా తగ్గుతుంది. చినబాబుని సి‌ఎం అభ్యర్ధిగా ముందుపెడితే టి‌డి‌పికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు….చినబాబుని సైలెంట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడే చినబాబు హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదని, అలాగే ప్రజాయాత్ర లాంటివి చినబాబుతో చేయించడం వల్ల కూడా ఉపయోగం లేదని కొందరు సీనియర్లు చంద్రబాబుకు సూచనలు ఇచ్చారట. పైగా జనసేనతో పొత్తు అనుకుంటున్నప్పుడు పవన్‌తో పోలిస్తే చినబాబు సరిపోరు…అలాంటప్పుడు జనసేన సైతం మద్ధతు ఇవ్వదు. అదే చంద్రబాబు ముందు ఉంటే ఇబ్బంది లేదు.  ఈ క్రమంలోనే చంద్రబాబు…చినబాబుని సైలెంట్ చేశారని తెలుస్తోంది. ఇక ప్రజా యాత్ర కూడా చంద్రబాబే చేయనున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news