Prabhas Radhe Shyam: రాధే శ్యామ్ నుంచి మ‌రో క్రేజీ అప్డేట్..! క్లైమాక్స్ కోసం దిమ్మ‌తిరిగే బడ్జెట్..

-

Prabhas Radhe Shyam: బాహుబలి సీరిస్ హిట్ తో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తాజాగా ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ వ‌స్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. ఎపిక్ ల‌వ్‌స్టోరిగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కోసం డార్టింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా
ఆయ‌న‌ ఫ్యాన్స్ కోసం ఓ క్రేజీ అప్డేట్ ని అందించారు.

 

ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా ‘రాధే శ్యామ్’ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అక్టోబర్ 23 ఉదయం 11:16 గంటలకు ‘రాధే శ్యామ్’ టీజర్ రిలీజ్ చెయ్యబోతున్న‌ట్లు తెలిపారు. దాదాపు మూడేళ్లుగాఈ సినిమా కోసం ప్రభాస్ అండ్ రాధా కృష్ణ అంకితమైపోయారు. ఈ క్ర‌మంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైర‌ల్ అవుతుంది.

ఈ చిత్ర క్లైమాక్స్ ను కళ్లు చెదిరేలా తెర‌కెక్కియ‌న‌న్న‌ట్లు తెలుస్తుంది. ఇందులో కోసం భారీ మొత్తంలో బ‌డ్జెట్ ను కేటాయించిన‌ట్టు తెలుస్తుంది. దాదాపు 15 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా సాగే
క్లైమాక్స్ కోసం ఓవరాల్‌గా 50 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఒక క్లైమాక్స్‌కే ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టారంటే.. ఇక సెట్స్‌కి, సాంగ్స్‌కి ఎంతలా ఖర్చు చేసుంటారో అర్థం చేసుకోవచ్చు.

చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న డార్లింగ్ అండ్ గోర్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా న‌టిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news