తెలంగాణలో ఈరోజు నుండి గురుకులాలు ప్రారంభంకానున్నాయి. హైకోర్టు ఆదేశాలతో గురుకులాలు తెరుచుకున్నాయి. దాంతో నాలుగున్నర లక్షల మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు జరగనున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం బిసి కులాలు వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. ఇక ఎస్సీ గురుకుల విశ్వవిద్యాలయాలు ఈరోజు నుండి ప్రారంభిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో గురుకులాలను తెరవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటికే పాఠశాలలు తెరుచుకున్నా గురుకులాలు తెరుచుకోకపోవడం తో విద్యార్థులకు ఇంకా ఆన్లైన్ బోధన తోనే పాఠాలు చెబుతున్నారు. హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు జరగనున్నాయి.