తులసి నూనె ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. తులసి ఆకుల నుండి తులసి నూనె మనం తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కనుక మనకి సులువుగా ఇది దొరుకుతుంది. ఇందులో ఆయుర్వేద గుణాలు సమృద్ధిగా ఉంటాయి. తులసి ఆకుల పొడితో టీ వంటివి మనం చేసుకుని వాడచ్చు.
అలానే తులసి నూనె కూడా చేసుకోవచ్చు. తులసిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. పోషకాలు మరియు అందాన్ని పెంచే గుణాలు కూడా దీనిలో ఉంటాయి. అయితే ఈ రోజు తులసి నూనె వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది చూద్దాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
చర్మానికి మంచిది:
తులసి నూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. అదే విధంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్, యాక్ని వంటి సమస్యలు తగ్గుతాయి.
అజీర్తి సమస్యలు ఉండవు:
తులసి నూనె అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. కాన్స్టిపేషన్, స్టమక్ క్రామ్ప్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ వంటి సమస్యల నుండి కూడా తక్షణ రిలీఫ్ ను ఇస్తుంది.
జలుబు తగ్గుతుంది:
తులసి నూనె ని వాడడం వల్ల జలుబు తగ్గుతుంది. అదేవిధంగా దగ్గు వంటి సమస్యలు కూడా తులసి తో మనం పరిష్కరించుకోవచ్చు.
ఆస్తమా సమస్య తగ్గుతుంది:
దగ్గు, ఆస్తమా, సైనస్ మొదలైన లక్షణాలు ఉన్నప్పుడు తులసి నూనెను ఉపయోగిస్తే చక్కటి రిలీఫ్ ని పొందొచ్చు. అలానే ఇబ్బంది కూడా ఉండదు.
ఒత్తిడి తగ్గుతుంది:
తులసి నూనెను అరోమా థెరపీ కి కూడా వాడతారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంచుతుంది అదే విధంగా ఒత్తిడి, డిప్రెషన్, మైగ్రేన్, మానసిక సమస్యలను ఇది తగ్గిస్తుంది. చూసారా తులసి నూనె వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. కనుక ఈ సమస్యలు ఉంటే తులసి నూనెను వాడండి సమస్యల నుండి దూరంగా ఉండండి.