కోస్తా రాయలసీమలో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈశాన్య గాలుల ప్రభావం…తేమ గాలులు వీస్తుండటం తో ఈరోజు రేపు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే రాష్ట్రం లో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం అయ్యింది.
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈ నెల 23 నాటికి సగం కు పైగా ప్రాంతాల్లో….26 నాటికి రాష్ట్రం నుండి పూర్తిగా నిష్క్రమణ ఉంటుందని వాతావరశాఖ అధికారులు వెల్లడించారు. అయితే అదే సమయంలో రాష్ట్రం లోకి ఈశాన్య రుతువనాలు ప్రవేశిస్తాయి అని పేర్కొన్నారు. ఇక గడిచిన 24గంటల్లో కూడా రాష్ట్రం లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ ఏడాది కురిసిన వర్షాలతో నదులు వాగులు, వంకలు నిండిపోయాయి.