తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎప్పటి నుంచో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న… ఉద్యోగాల భర్తీ పై తాజాగా కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాల విద్యాశాఖలో ఏకంగా 5323 పోస్టుల తాత్కాలిక భర్తీకి అనుమతిస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలలకు 2343 ఇన్ స్ట్రాక్టర్లు, 1435 ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అలాగే కేజీబీవీ లకు… 937 పోస్ట్‌గ్రాడ్యుయేట్ రెసిడెన్షియల్ టీచర్ల పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్ ట్రైనర్లు, ఒకేషనల్ కోఆర్డినేటర్లు మరియు ప్రభుత్వ కళాశాలలకు 211 బోధన సిబ్బంది పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అనుమతులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు… మరియు నియామక ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కానున్నట్లు అధికారులు చెప్పారు. ఇక ఈ పోస్టుల భర్తీ ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్సైట్లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.