‘జనసేనాని’కి మరోసారి కంటి ఆపరేషన్

-

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి మరోసారి కంటికి శస్త్రచికిత్స జరిగింది. గత ఐదారు నెలలుగా పవన్ కంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారు.  దీంతో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా పవన్ ఎడమ కంటిలో చిన్న కురుపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కంటి నొప్పి క్రమంగా ఎక్కువ కావడంతో గత నెల శస్త్రచికిత్స చేయించుకున్నారు. అపరేషన్ అనంతరం విశ్రాంతి అసరమని వైద్యులు పవన్ కి సూచించారు. అయితే ఈ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలోప్రజా పోరాట యాత్రను కొనసాగించడంతో పాటు బహిరంగ సభలను నిర్వహించడం, ఇతర ప్రాంతాల్లో పర్యటనల వల్ల  తగినంత విశ్రాంతి లేకపోవడంతో  కంటికి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో  గురువారం   బంజారాహిల్స్ లోని ‘సెంటర్ ఫర్ సైట్’ కంటి ఆసుపత్రిలో వైద్యుల సూచనల మేరకు మరో సారి ఆపరేషన్ చేయించుకున్నారు. నేత్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్. సంతోష్ జి. హోనావర్ ..పవన్ కల్యాణ్ కి ఆపరేషన్ నిర్వహించారు.  కనీసం ఈ నెలాఖరు వరకు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు జనసేనానికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news