సిఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారా….? లేక గాడిదలు కాస్తున్నారా ? అని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. ఫామ్ హౌస్ లో మొద్దు నిద్ర పోతున్నారని.. 36 లక్షల మంది రైతులను కేసీఆర్ మోసం చేశారని అగ్రహించారు షర్మిల. తాళి బొట్టు తాకట్టు పెట్టి ఫీజులు కడుతున్నారని.. తమ బతుకులు ఆగం అయ్యాయని మహిళలకు బాధ పడుతున్నారని పేర్కొన్నారు. ఇవాళ షర్మిలా నాలుగో రోజు పాదయాత్రను ముగించారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. పెట్రోల్,డీజిల్ ధరలు అమాంతం పెరిగాయని.. కరోనా అని చూడకుండా 30 రూపాయలు పెంచారన్నారు. కరోనా సమయం లో ధరలు తగ్గకుండా పెంచుకుంటూ పోతున్నారని.. బేస్ ధర మీద 60 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ , బీజేపీ కలిసి పెట్రోల్ ధరలు పెంచి రక్తం పిండుతున్నారని.. బీజేపీ కి ఎంత పాపం ఉందో కేసీఆర్ కి అంతే పాపం ఉందన్నారు.
తెలంగాణ ప్రజలు చీరలు అడగలేదు…ఉద్యోగాలు అడిగారని చురకలు అంటించారు వైఎస్ షర్మిల. డబుల్ బెడ్ రూం అడగలేదు…ఇస్తామని హామీ ఇచ్చారని.. కేసీఆర్ రెండు సార్లు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ సారి వైఎస్సార్ తెలంగాణ కి అవకాశం ఇవ్వండి.. వైఎస్సార్ పాలన మళ్ళీ తెస్తానని హామీ ఇచ్చారు వైఎస్ షర్మిల.