Tamannaah : మిల్కీ బ్యూటీ టైమ్ బాలేదా? ఇక ఆ సినిమాపైనే ఆశలన్నీ !

-

Tamannaah : తమన్నా భ‌టియా .. సౌత్ ఇండియా ప్రేక్ష‌కులు పరిచయం అక్కర్లేని పేరు. మిల్కీ బ్యూటీగా ఫేమ్ సంపాదించిన ఈ బ్యూటీ.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తమన్నా .. టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. చాలా మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. కానీ, ఆ మధ్య కాస్త స్లో అయ్యింది. ఆమె స్టార్ డాం ఫాల్ డౌన్ అవుతూ వ‌స్తుంది.

అందుకు అనేక కార‌ణాలు ఇండ‌స్ట్రీలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఓ ప్ర‌ముఖ టీవీ ఛానల్ లో హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించేందుకు తమన్నాకు ఆఫర్ వచ్చింది. కానీ మిల్క్ బ్యూటీ హెస్టింగ్ స‌రిగా లేద‌నీ,
ఆమె వ‌ల్ల కోట్ల‌లో న‌ష్టం వ‌చ్చింద‌ని ఈ షో నిర్వ‌హ‌కులు ఆమెను మ‌ధ్యలోనే తొలగించారు. త‌న స్థానంలో అనుసూయను నియ‌మించి.. నిర్వ‌హ‌కులు ఘోరంగా అవ‌మానించారు.

ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీలో త‌మ‌న్నాను హీరోయిన్ తీసుకున్న‌ట్లు మొదట టాక్ వచ్చింది. కానీ ఏమైందో, తెలియ‌దు.. ఈ అమ్మ‌డికి ఊహించ‌ని షాక్ ఇచ్చింది
చిత్ర యూనిట్.మెగాస్టార్ భారీ ప్రాజెక్ట్ నుంచి తమన్నా తప్పుకుంది అని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అస‌లు ఈ అమ్మ‌డికి టైం బాగాలేదు.

ఈ మధ్య ఆమె న‌టించిన‌ సీటీమార్, మాస్ట్రో చిత్రాలను కూడా జనాదరణ పొందలేదు. ఈ క్ర‌మంలో ఐతే ఎఫ్ 3పై తమన్నా బోలెడు ఆశలు పెట్టుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వచ్చి సూపర్ హిట్ అయిన ఎఫ్ 2కి సీక్వెల్ గా వస్తోంది ఎఫ్ 3. షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో తన కెరీర్ మళ్లీ పుంజుకుంటేందేమోనని ఆశపడుతోంది.

ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తుందా శీతాకాలంతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీ దట్ ఈజ్ మహాలక్ష్మితో పాటు బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చేస్తోంది. సో.. తమన్నా కెరీర్‌పై వస్తోన్న ఈ రూమర్స్ పై ఆమె ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news