ఏపి రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్ !

-

రేషన్ డీలర్ల శాంతియుత నిరసనలపై ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రేషన్ డీలర్ల సమస్యల పై సానుకూలం గా స్పందించారు మంత్రులు, అధికారులు. ఇవాళ జరిగిన సబ్ కమిటీ మీటింగ్ లో రేషన్ డీలర్ల గురించి చర్చ జరిగినది. గన్నీ సంచులకు డబ్బులు, ఇతర సమస్యలు ను సిఎం జగన్ దృష్టి కి తీసుకెళతామని ఏపీ మంత్రులు హామీ ఇచ్చారు. గత రెండు నెలలుగా ఇచ్చిన ఖాళీ గోనె సంచుల డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు మంత్రి మంత్రి కొడాలి నాని.

క్యాబినెట్ సమావేశం లో జీవో నెంబర్ పది గురించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి జీవోను రద్దు చేసే విధంగా ఏర్పాటు చేస్తామని నలుగురు మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో తమ ఆవేదన ను అర్ధం చేసుకుని భరోసా ఇచ్చిన మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు రేషన్ డీలర్ల అసోసియేషన్ నేతలు. మంత్రుల, అధికారుల భరోసా తో రేషన్ డీలర్ల శాంతియుత నిరసనలకు తాత్కాలికంగా వాయిదా పడింది.. అలాగే నేటి నుండి MLS points నుండి డీలర్స్ సరుకు రవాణా కు అంగీకారం తెలిపింది. ఇక ఇవాళ కేబినెట్ సమావేశం అనంతరం.. దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సంచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news