మీరు ఎక్కువగా పాపడ్ తింటున్నారా… రుచిగా ఉన్నాయని రోజంతా లాగిస్తున్నారా..? అయితే మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. పాపడ్ అధికంగా తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చాలా మంది ఇళ్లల్లో చిరుతిండిగా పాపడ్ రుచిని ఆస్వాదిస్తుంటారు. కొంతమంది చాలా ఇష్టంగా పాపడ్ తింటుంటారు. అలాంటి వాళ్లు తమ ఆరోగ్యాన్ని రిస్క్ లో పెడుతున్నట్లే. పాపడ్ మనం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందా. పాపడ్ లో వాడే ప్రిజర్వేటివ్స్ లో సోడియంను కలుపుతారు. ఇది పాపడ్ రుచిని మరింత పెంచుతుంది. అయితే అధికంగా సోడియం తీసుకోవడం వల్ల కిడ్నీమరియు గుండె జబ్బులకు గురయ్యే అవకావం ఉంది. పాపడ్ తినడం వల్ల ఉబకాయం పెరగుతుంది. పాపడ్ లో రెండు చపాతీల కన్నా ఎక్కువ కాలరీలు ఉంటాయి. ఫలితంగా స్థూలకాయం సమస్య ఏర్పడవచ్చు. మీరు బరువు తగ్గి నాజూకుగా కావాలంటే పాపడ్ జోలికి వెళ్లకపోవడమే బెటర్. పాపడ్ లో రుచి కోసం మసాలాలు, రుచిని పెంచే పదార్థాలను వాడుతుంటారు. దీని వల్ల మనుషుల్లో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే పాపడ్ కు దూరంగా ఉండటమే బెటర్.