కళ్లను దానం చేసిన పునీత్ రాజ్ కుమార్

-

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ క్రితమే మృతి చెందారు. కన్నడ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే రాజ్ కుమార్ తనయుడు.. పునీత్ రాజ్కుమార్ ఇక లేడన్న విషయం ఆయన అభిమానులను శోకసంద్రం లోకి నెట్టింది. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన పునీత్.. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మరణించారు. 46 సంవత్సరాల వయసులోనే ఆయన మృతి చెందడం చిత్ర పరిశ్రమను కుదిపేసింది.

ఇక ఆయన మృతి పట్ల.. సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. అయితే పునీత్ రాజ్ కుమార్ తన మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడనున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తన కళ్ళను… దానం చేసినట్లు వైద్యులు కాసేపటి క్రితమే ప్రకటించారు.

గతంలో పునీత్ తండ్రి.. కంఠీరవ రాజ్కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్ళను మరొకరి కోసం కుటుంబీకులు దానం చేసి కొత్త వెలుగు ప్రసాదించారు. దీంతో పునీత్ కుటుంబీకులపై అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే… తాజాగా పునీత్ కళ్లను కూడా దానం చేశారు. కాగా పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపు జరగనున్నట్లు సమాచారం అందుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news