పెళ్లయిన మూడునెలలకే నవ దంపతుల ఆత్మహత్య..!

-

పెళ్లయిన మూడు నెలలకే నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. క్షణికావేశంలో భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆ వార్త విని భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చీపురు వలస గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాము (30) జెసిపి ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అతడికి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం కి చెందిన వెంకట హేమ దుర్గా అనే యువతితో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే మూడు నెలల నుండి కలిసిమెలిసి ఉన్న ఈ జంట ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పెళ్లికి ముందు వెంకట హేమ దుర్గా వాలంటీర్ గా పని చేసేది.

అయితే పెళ్ళైన తరవాత కూడా ఎక్కువగా ఫోన్ లు రావడం మొదలైంది. దాంతో భర్త సిమ్ తీసి వేయాలని కోరాడు. సెల్ ఫోన్ లో నుండి సీఎం తీయాలని తన భావ మరిదికి చెప్పి అతడి వద్దే ఫోన్ ఉంచాడు. ఇక ఎప్పటిలాగే శనివారం రాము విధులకు వెళ్ళాడు. ఆ సమయంలో భార్య ఎదురు వెళ్లి సాగనంపింది. అనంతరం ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ విషయం రాము చెల్లి అతడికి ఫోన్ చేసి చెప్పడం తో తాను కూడా సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి గ్రామ శివార్లలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news