గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ పొరపాటున కారు హారన్ కొట్టడంతో వసూ పరుగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ అప్పటికే రిషీ వెళ్లిపోతాడు. జగతి బయటకువచ్చి ఏమైంది వసూ అంటే.. రిషీ సార్ కార్ హారన్ వినిపించింది అంటుంది. నువ్వేదో పొరపాటు పడి ఉంటావ్ అని వసూని లోపలకి తీసుకెళ్తుంది జగతి. ఆరోజు రాత్రి రిషీ భోజనం చేయకుండానే వెళ్లిపోతాడు. ధరణి అడగితే..నాకు ఆకలిగా లేదు వదినా అంటాడు. ధరణి రిషీ ఏంటో డల్ గా ఉంటున్నాడు.. చిన్నమావయ్యగారికి చెప్తే త్వరగా ఇంటికి వస్తారుగా కదా అనుకుని మహేంద్రకు కాల్ చేస్తుంది. ఎక్కడున్నారు అంటే.మహేంద్ర వస్తున్నాను అని మాట్లాడతాడు..ఇంతలోనే ధరణి ఫోన్ దేవయాని తీసుకుంటుంది. నేనొచ్చేస్తున్నాను అంటాడు మహేంద్ర. ఫోన్ కట్ చేసి ధరణీని ఏసుకుంటుంది. రిషీ తినకపోతే ప్రచారం చేయాలా…వెళ్లి భోజనం తీసుకురా అంటుంది.
రూంలో రిషీ వసూ జ్ఞాపకాలను తలుచుకుని భాదపడుతూ ఉంటాడు. ఇంతలో దేవయాని ధరణి ఫుడ్ తీసుకుని వస్తారు. ప్లేట్ అక్కడ పెట్టి ధరణీని పంపిస్తుంది. దేవయాని ఏంటి నాన్న అన్నం తినలేదు అని తినిపిస్తా అంటూ బుజ్జగిస్తుంది. రిషీ తినాలనిపించలేదు పెద్దమ్మా అంటాడు. దేవయాని అక్కడపెట్టేసి త్వరగా తినమని చెప్పేసి వెళ్లిపోతుంది. ఇంట్లో వసూ కూడా రిషీ సార్ ఏంటి అలా వచ్చి ఇలా వెళ్లారు, సార్ మనసులో ఏముంది, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జగతి వచ్చి ఏంటి వసూ ఈమధ్య ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నావు, ఎందుకు వసూ ఇన్నిన్ని ఆలోచనలు, అసలు చదువుమీద దృష్టిపెడుతున్నావా నువ్వు అంటుంది. వసూ ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా మేడమ్ అంటుంది. అది కాదు వసూ..ఏమవుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో నాకేం అర్థంకావటం లేదు అంటుంది జగతి, నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు అంటుంది. వసూ రిషీసార్ వచ్చారు అని చెప్పబోతుంది. జగతి..వసూ రిషీ వస్తే వచ్చాడు, వెళ్తే వెళ్లాడు..ఆ టాపిక్ మీద నువ్వు ఆలోచిస్తే ఏమవుతుంది చెప్పు అని భోజనానికి తీసుకెళ్తుంది.
ఇటుపక్క రిషీ కూడా భోజనం చేయకుండా వసూనే గుర్తుచేసుకుంటాడు.మహేంద్ర వస్తాడు. ఏంటి రిషీ ఇంకా తినలేదా అని తినిపెడతాడు. మహేంద్ర మనసులో రిషీ మనసులో ఏముంది అసులు, ఎంగేజ్ మెంట్ దగ్గరకు వచ్చాడు వెళ్లాడు, ఈరోజైనా నోరు మనసులు విప్పరా అనుకుని..వచ్చివెళ్లావట ఎంగేజ్ మెంట్ కి అంటే..హా అంటాడు.లోపలికి వస్తే బాగుండేది కదా అని మహేంద్ర అంటే..నాకు కూడా పనులు ఉంటాయ్ కదా , మీ లాగా రాయబారాలు, పెత్తనాలు నేను చేయలేను అంటాడు రిషీ. మొఖంలో ఏదో తెలియని డిస్టబెన్స్ కనిపిస్తుంది రిషీ అంటాడు. ప్రతిసారి నవ్వుతూ ఉండలేను కదా డాడ్. నా టెన్షన్స్ నాకు ఉంటాయ్ కదా అంటాడు. ఇలా మహేంద్ర ఎన్నివిధాలుగా ట్రై చేసినా రిషీ మనసులో మాట చెప్పడు.
ఇటుపక్క వసూ రిషీకి కాల్ చేస్తుంది. మహేంద్ర చూసి పొగరా పొగరు ఎవరు అంటాడు. రిషీ లిఫ్ట్ చేసి నేను బిసీగా ఉన్నాను, మా డాడ్ తో ఉన్నాను అంటాడు. మహేంద్ర ఎవరు రిషీ అంటే..తెలిసినవాళ్లు అంటాడు. మహేంద్ర శిరీష్ టాపిక్ తీయగానే..రిషీ గుడ్ నైట్ చెప్తాడు. మహేంద్ర లేచి వెళ్లిపోతూ..ఏమైనా చెప్పాలనుకుంటున్నావా రిషీ అంటే.. రిషీ గుడ్ నైట్ చెప్తాడు. మహేంద్ర వెళ్లిపోతూ..నీ పెళ్లిటాపిక్ తీస్తాననేకదా నువ్వు గుడ్ నైట్ అంటుంది. ఇంకెన్నాళ్లు నటిస్తావురా, నిన్ను వదిలే ప్రసక్తేలేదు అనుకుని వెళ్లిపోతాడు.
మరుసటిరోజు ఉదయం రిషీ కాలేజ్ కి వెళ్తాడు. వసూ చెట్టుకింద స్టూడెంట్స్ తో కలిసి చదువుకున్నట్లు కనిపిస్తుంది. కానీ అక్కడ వసూకాదు వెరెవరో ఉండేది. రిషీ అలానే వసూ ఆలోచనలో ఉంటాడు. ఇంతలో రిషీ వచ్చి,ఏంటి ఏండిగారు దిగరా అంటే..చూస్తున్నాను డాడ్ అంటాడు. ఏం చూస్తున్నావ్ అంటే అమ్మాయిలను డాడ్ అంటాడు రిషీ. మహేంద్ర షాక్ అవుతాడు..రిషీ అమ్మాయిల గురించి చెప్తాడు.అమ్మాయిలు అద్భుతం డాడ్..అన్నీ వాళ్లకే తెలుసు అనుకుంటారు. కానీ ఏం తెలియదు, ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియదు…ఆరోజు సాక్షి ఇప్పుడు అంటాడు. మహేంద్ర హా ఇప్పుడు అంటే..రిషీ ఏం లేదు అని వెళ్లిపోతాడు. వసూ జగతీలు కూడా వస్తారు. వసూ రిషీకి గుడ్ మార్నింగ్ చెప్తే పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. వసూ మహేంద్ర దగ్గరకు వచ్చి ఏంటి సార్ రిషీ సార్ నేను విష్ చేసినా పట్టించుకోకుండా వెళ్తున్నారు అంటే..క్లాస్ టైం అయినట్లు అందుకే వెళ్లినట్లు ఉన్నాడు అంటాడు మహేంద్ర. వసూ ఏంటీ సార్ మీరు కూడా రిషీ సార్ నే సపోర్ట్ చేస్తున్నారు, సర్లే నాకు క్లాస్ టైం అయింది అని వసూ వెళ్లిపోతుంది.
మహేంద్ర జగతిని కలుస్తాడు. జగతి ఏం అంటున్నారు మన ఎండీగారు అని అడుగుతుంది. రిషీ ఏదో విషయం మీద రిసెర్జ్ చేస్తున్నారు అంటాడు మహేంద్ర. రిషీ రీసెర్చ్ చేస్తున్నాడా అని జగతి అంటే..హా నాకు కూడా ఇప్పుడే తెలిసింది అంటాడు మహేంద్ర. జగతి సబ్జెక్ట్ ఏంటి అంటే..మహేంద్ర ఏదో చెప్పి కవర్ చేస్తాడు. ఇలా ఇద్దరూ రిషీ గురించి మాట్లాడుకుంటారు. జగతి రిషీది చాలా సున్నితమైన మనసు తనని ఎప్పుడూ బాధపెట్టకు అంటుంది. నా సాయశక్తులా మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయటానికి ప్రయత్నిస్తున్నాను అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో వసూ రిషీ క్యాబిన్ కి వెళ్తుంది. రిషీకి వసూపక్కన శిరీష్ కూడా ఉన్నట్లు కనిపిస్తాడు. వెళ్లండి అంటాడు రిషీ. వెళ్లండి అంటున్నారు ఇంకెవరు ఉన్నారు సార్ అంటుందివసూ. రిషీ కోపంలో అక్కడే ఉన్న పెన్ ని విసిరేస్తాడు. అది వచ్చి వసూకి తగుల్తుంది. రిషీ వచ్చి సారీ అలా తగుల్తుంది అనుకోలేదు అని చున్నీని నోట్లో పెట్టుకని ఊది కంటిమీద పెడతాడు. అప్పుడే వసూ చేతికి జగతి ఇచ్చిన రింగ్ చూసి మళ్లీ దూరంగా వెళ్తాడు. ఇప్పట్లో తేలేలాలేదు ఈ ట్విస్ట్..మన రిషీని ఇంకెన్ని రోజులు బాధపెడతారో.