కోవాగ్జిన్ కు భారీ విజయం… గుర్తించిన ఆస్ట్రేలియా..

-

గుర్తింపు కోసం ఎదురుచుస్తున్న భారతయ తయారీ భారత్ బయోటెక్ కోవాగ్జిన్ కు భారీ విజయం లభించింది. తాజాగా కోవాగ్జిన్ ను గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం WHO అత్యవసర అనుమతుల కోసం ఎదురు చూస్తున్న కోవాగ్జిన్కు .. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించనుంది.

కోవాగ్జిన్ తో పాటు చైనా తయారీ సినోఫార్మ్ వ్యాక్సిన్ కు కూడా ఆస్ట్రేలియా గుర్తించింది. దీంతో భారత్, చైనా నుంచి వెళ్లే విద్యార్ధులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. కోవాగ్జిన్ వేసుకున్న 18 ఏళ్లు పైబడిన ప్రయాణికులు ఆస్ట్రేలియా ప్రయాణించాలంటే అడ్డుగా ఉన్న నిబంధనలు తొలిగిపోయాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నవంబర్ 3 సమావేశంలో కోవాగ్జిన్ అత్యవసర వినియోగపు అనుమతిపై నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈ ఏడాది నుంచి అత్యవస వినియోగపు అనుమతి కోసం ఎదురుచూస్తోంది. దీనిపై ఇప్పటికే WHO పలుమార్లు కోవాగ్జిన్ ఉత్పత్తిదారుల నుంచి సమాచారం కోరింది. 

Read more RELATED
Recommended to you

Latest news