BREAKING : ఏపీలో నెల్లూరు కార్పోరేష‌న్ స‌హా మిగిలిన ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్..!

-

ఏపీలో మిగిలిన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 15న మున్సిపాలిటీలు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా 17న ఫలితాలు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు 498 పంచాయతీల్లో 69 సర్పంచ్లకు ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి… అదే రోజున కౌంటింగ్ జరగనుంది.

13 కేంద్రాల్లో మిగిలిన 187 ఎంపీటీసీ స్థానాలు 16 జడ్పిటిసి స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి…. అదే రోజున ఫలితాలు రానున్నాయి. అన్ని స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు నవంబర్ 3 నుండి నవంబర్ 5 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక ఎన్నిక‌ల నోటిఫికేషన్ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఏపీ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా రిలీజ్ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ తో ఏపీ పాలిటిక్స్ మరింత వేడెక్కే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news