రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ముక్కుపచ్చలారని ఆరేండ్ల చిన్నారిపై టీఆర్ఎస్ నాయకుడు..సర్పంచ్ భర్త అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఆ చిన్నారి కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. నిలోఫర్ ఆస్పత్రిలో బాలిక చికిత్స పొందుతుండగా పలువురు నాయకులతో కలిసి బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… ఈ ఘటన దుర్మార్గం అని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు లైసెన్స్ డ్ గూండాలుగా మారిపోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభంశుభం తెలియని పసిపాప బంగారు భవిష్యత్తును నాశనం చేసిన ముర్ఖుడిని కఠినంగా శిక్షించాలి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో పసిపిల్లలపై అఘాయిత్యాలు… దాడులు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని బండి సంజయ్ అన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించాను అని ఆయన పేర్కొన్నారు. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులకు బిజెపి అండగా ఉంటుంది అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.