హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటెల రాజేందర్ 20వేలకు పైగా మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై విజయం సాధించారు. కాగా తాజాగా ఈటెల రాజేందర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. జేపీ నడ్డా చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ ఈటెల ఈ కామెంట్లు చేశారు. హుజురాబాద్ లో విజయం అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. గెలిచిన ఈటెలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి జేపీ నడ్డా కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా ఆ ట్వీట్ కు ఈటెల రిప్లై ఇస్తూ..తన పై నమ్మకం ఉంచినందుకు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. జేపీ నడ్డా జీ.. ఈ ఎన్నికలో మాపై నమ్మకం ఉంచి, మాకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు అంటూ ఈటెల పేర్కొన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నిబద్ధతతో పని చేసేందుకు మీ సూచనలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఈటెల దీమా వ్యక్తం చేశారు.