తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ పై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిన్నారి వైష్ణవి ఫిర్యాదు చేసింది. రంగా రెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడ్ కి పాఠశాల సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ లేఖ రాశారు చిన్నారి వైష్ణవి.
అయితే.. ఆ చిన్నారి వైష్ణవి లేఖ పై స్పందించిన జస్టిస్ రమణ…. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి బస్సు సౌకర్యం కల్పిం చాలని ఉత్వరులు జారీ చేశారు. జస్టిస్ రమణ ఉత్వరులు మేరకు రీజినల్ మేనేజర్ ద్వారా ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు మంచాల మండలం చీదేడు కు, పునర్ ప్రారంభించారు TS RTC అధికారులు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.