గత కొంత కాలంగా పెట్రోల్ డిజిల్ ధరలు విపరీతంగా పెరుగుతన్నాయి. దీంతో సామన్యులు ద్విచక్ర వాహానాలు నడపాలంటేనే పెట్రోల్ భయం తో వణికి పోయారు. అయితే దీని పై కేంద్ర ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించేలా శుభవార్త చెప్పింది.
దీపావళి కానుకగా పెట్రోల్ , డిజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి లీటర్ పెట్రోల్ పై రూ.5 అలాగే లీటర్ డిజిల్ పై రూ. 10 ఎక్సైజ్ సుంకం ను తగ్గిస్తున్నట్టు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్ , డిజిల్ పై తగ్గిన ధరలు రేపటి నుంచి అమలు అవుతాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే పెట్రోల్ డిజిల్ ధరలు వరుసగా పెరుగడం తో విసిగి పోయిన సామన్య ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు.
అయితే ఈ నెలలో పెట్రోల్ , డిజిల్ ధరలు 22 సార్లు పెరిగియి. ప్రతి సారి కూడా కనీసం రూ. 0.30 కి పైగానే పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజా గా పెట్రోల్ డిజిల్ ధరలు తగ్గించడం పై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వమే పెంచి మళ్లి ప్రభుత్వమే తగ్గిస్తు ప్రజాధారణ పొందాలని చూస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. అలాగే మరి కొంత మంది కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అంటున్నారు.