యువ క్రికెట‌ర్ల‌కు గంభీర్ సూచ‌న‌లు

-

టీమిండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ ముస్తాక్ అలీ టోర్నమెంటు ఆడుతున్న యువ క్రికెట‌ర్ల కు ప‌లు సూచ‌న‌లు చేశాడు. యువ ఆట‌గాళ్లు అంద‌రూ కూడా ఈ ముస్తాక్ అలీ టోర్న‌మెంటు బాగా ఉప‌యోగించు కోవాల‌ని అన్నాడు. జ‌ట్ల ల‌క్ష్యం ట్రోఫి అందుకోవ‌డమే ఉండాల‌ని అన్నారు. కానీ వ్య‌క్తిగ‌తం గా ప్ర‌తి ఒక్క‌రు ఐపీఎల్ ఫ్రోంఛైంజీల‌ను ఆక‌ట్టు కునే విధంగానే ఆడాల‌ని సూచించాడు.

ఈ టోర్న మెంట్ లో ఎంత బాగ ఆడుతే ఐపీఎల్ వేలంలో అంత డిమాండ్ పెరుగుతుంద‌ని వివరించాడు. కాగ నేటి నుంచి ముస్తాక్ అలీ ట్రోర్న‌మెంట్ ప్రారంభ‌మవుతుంది. ఈ టోర్న‌మెంట్ లో 38 జ‌ట్లు ఆడుతున్నాయి. ఈ 38 జ‌ట్లు 105 మ్యాచ్ లు ఆడ‌నున్నాయి. అలాగే డిసెంబ‌ర్ చివ‌ర్లో ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జ‌ర‌గ‌నున్నది. దీంతో ఈ ట్రోర్న‌మెంట్ లో మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసిన వారిని ఐపీఎల్ ఫ్రోంఛైంజీలు ఎ క్కువ మొత్తం లో ఖ‌ర్చు చేసి తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news