జై భీమ్ లోని ఆ సీన్ పై ఉత్త‌రాది లో అభ్యంత‌రాలు

-

ఇటీవ‌ల అమెజ‌న్ ప్రైమ్ లో విడుద‌ల అయిన జై భీం సినిమా కు విమ‌ర్శ‌కులు నుంచి కూడా ప్ర‌శంశ‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమా లో మంచి మెసెజ్ ఉండ‌టంతో ద‌క్షిణాది లో మంచి హిట్ టాక్ ను తెచ్చు కుంటుంది. అయితే ఈ సినిమా లో ఒక సీన్ పై ఉత్త‌రాది ప్ర‌జ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. జై భీం సినిమాలో పోలీస్ పాత్ర లో ఉన్న ప్ర‌కాశ్ రాజ్ ఒక కేసు విచార‌ణ సంద‌ర్భంలో ఒక మార్వాడి న‌గ‌ల వ్యాపారిని విచారిస్తాడు.

అయితే ఈ సంద‌ర్భంలో ఆ మార్వాడి న‌గ‌ల వ్యాపారి హింది లో మాట్లాడుతాడు. అయితే ప్రకాశ్ రాజ్ త‌మిళ్ లో మాట్లాడాల‌ని ఆ వ్యాపారిని చెంప పై కొడుతాడు. ఇక్క‌డే ఉత్త‌రాది ప్ర‌జ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి చెంప దెబ్బ కొట్ట‌డం ఎందుకు చెబితే స‌రి పొతుంది క‌దా.. అని హింది ఆడియాన్స్ అంటున్నారు. అయితే గ‌తం లో కూడా హింది భాష కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడులో అనేక ఉద్య‌మాలు జ‌రిగాయి. ఆ ఉద్య‌మాల‌కు ప్ర‌కాశ్ రాజ్ కూడా మ‌ద్ధ‌త్తు గా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news