సీజన్ లో దొరికే పండ్లని తింటే ఎంతో మంచిది..!

-

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి.

ముఖ్యంగా తీసుకొనే డైట్ లో కాయగూరలు, పండ్లు ఉండేటట్టు చూసుకోవాలి. అదే విధంగా సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు వంటివి తీసుకోవడం చాలా ముఖ్యం. సీజనల్ ఫ్రూట్స్ మరియు కూరగాయలు తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం పొందవచ్చు. క్యారెట్లు, ఆపిల్, కమలా, కివి మరియు ఇతర పండ్లు మరియు కూరగాయలు చలికాలంలో సమృద్ధిగా దొరుకుతుంటాయి. అయితే వాటి వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సీజనల్ ఫ్రూట్స్ మరియు కూరగాయలు తీసుకోవడం వల్ల పోషక పదార్థాలు బాగా అందుతాయి చలికాలంలో ఎక్కువగా జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వస్తాయి. అందుకని అటువంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మంచి పోషక పదార్థాలను తీసుకోవాలి. అవి సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలలో దొరుకుతుంది. అలానే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

అదే విధంగా సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు వల్ల ఎక్కువ ఖర్చు అవ్వదు. ఎందుకంటే చాలా ఎక్కువగా అవి మనకి అందుబాటులో ఉంటాయి ఎక్కువ సప్లై ఉంటుంది కాబట్టి కొనుగోలు చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు.

అలానే సీజనల్ ఫ్రూట్స్ మరియు కూరగాయలు చాలా తాజాగా దొరుకుతాయి. అలంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావు. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీజనల్ ఫ్రూట్స్ మరియు కూరగాయలను డైట్ లో తప్పకుండా తీసుకోవాలి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు రావు అలాగే ఆరోగ్యంగా ఉండడానికి కూడా వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news