ఇటీవల తమిళ నటుడు విజయ్ సేతుపతి పై విమానాశ్రయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఘటనను విజయ్ సేతుపతి పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ తాజాగా ఓ సంస్థ సంచలన ప్రకటన చేసింది. హిందూ మక్కల్ కచ్చి అనే సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ.1001 బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. విజయ్ సేతుపతి స్వాతంత్ర సమరయోధుడు దైవ తిరు మత్తు రామలింగ తెవర్ అయ్యను అవమానించారని ఆ సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ సేతుపతి ని తన్నిన వ్యక్తి మహాత్మా గాంధీ తో తాను మాట్లాడానని అర్జున్ సంపత్ పేర్కొన్నారు.
విజయ్ సేతుపతి కి జాతీయ అవార్డు రావడంతో మహాత్మాగాంధీ ఆయనను అభినందించాలని అనుకున్నారని కానీ సేతుపతి అతనితో వ్యంగ్యంగా మాట్లాడటం తో మహాత్మాగాంధీ షాక్ అయ్యారని చెప్పారు. అయినప్పటికీ మహాత్మాగాంధీ మీరు దక్షిణ జిల్లాలకు చెందిన వారు కావడంతో దైవ తిరు మత్తు రామలింగ తెవర్ అయ్య పూజకు రావాలని ఆహ్వానించారని చెప్పారు. దాంతో విజయ్ సేతుపతి వెటకారం గా ఈ ప్రపంచానికి ఒకే దేవుడు జీసస్ మాత్రమే అని అని చెప్పారు అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని దాంతో మహాత్మా గాంధీ సేతుపతిని తన్నారని చెప్పారు. మహాత్మగాంధీ తో మాట్లాడిన తర్వాత తాను బహుమతిని ప్రకటించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.