ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎన్నిచర్యలు తీసుకుంటున్నా.. మహిళపై దాడులు ఆగడం లేదు. ప్రేమ, పెళ్లి పేరుతో మహిళలను వేధిస్తూనే ఉన్నారు కొంతమంది దుర్మార్గులు. ఇలాంటి సంఘటనే ఇటీవల ఢిల్లోలో చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించదని వివాహితపై యాసిడ్ దాడి చేశాడు దుర్మార్గుడు.
వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన బాధిత మహిళ బవనా ప్రాంతంలో నివాసం ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన మోంటూ పెళ్లి చేసుకోవాలంటూ సదురు మహిళను వేధింపులకు గురిచేశాడు. అప్పటికే ఆ మహిళకు వివాహం అయింది. వేధింపులు భరించలేక ఢిల్లీలో బాధితురాలు తన భర్తతో కలిసి నగరంలోని పూత్ ఖుర్ద్ ప్రాంతానికి వెళ్లింది. అయినా మోంటూ వేధింపులు ఆగలేదు. అతను కూడా బాధితురాలు నివాసం ఉంటున్న ప్రాంతానికి మకాం మార్చాడు. ఈ నేపథ్యంలోనే గత బుధవారం నిందితుడు, బాధిత మహిళను ఇంటికి పిలిచి చేతులు కట్టేసి యాసిడ్ దాడి చేశారు. తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. అయితే దాడిలో గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం వేట సాగించారు. అయితే నిందితున్ని బీహార్ లో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మహిళ పెళ్లికి నిరాకరించడంతోనే ఇలా చేశానని తెలిపాడు. విచారణలో సదరు మహిళ భర్తను కాల్చాలని ప్లాన్ చేసుకున్నట్లు నిందితుడు వెల్లడించాడు. నిందితున్ని పట్టుకున్న సమయంలో పోలీసులపైకి కాల్పులు కూడా జరిపాడు. అయితే అలెర్ట్ అయిన పోలీసులు నిందితుడి భుజంపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. విచారణ సాగుతోంది.