టీఆర్ఎస్ కాదు… ఇక నుంచి ”తెలంగాణ రైతు సమితి” : కేటీఆర్

-

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రైతుల మహా ధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతుకు పెద్దపీట వేశారని… రైతు కంట కన్నీరు రాకూడదని కేసీఆర్ కొత్త చరిత్ర సృష్టించారన్నారు. రైతు కోసం సాగు కోసం రైతు బాగు కోసం కేసీఆర్ ఎన్నో చేశారని గుర్తు చేశారు కేటీఆర్‌.
టీఆర్‌ఎస్‌ పార్టీ ఇక నుంచి తెలంగాణ రైతు సమితిగా నడుస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌.

బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు జీపు తో తొక్కించి 8 మంది రైతులను చంపించాడని… రైతు తిరగబడితే వాళ్ళ ఎడ్ల బండ్ల కింద బిజెపి చిత్తవుతదని హెచ్చరించారు. రైతులు ఆత్మహత్యలు ఎక్కువ జరిగేవి అప్పట్లో ఆంద్రప్రదేశ్ ఉన్నప్పుడేనని.. 7 దశాబ్దాల పరిపాలనను తుడిచిపెట్టి 24 గంటల కరెంట్ కేసీఆర్ తెచ్చిపెట్టాడని గుర్తు చేశారు.

రైతన్నల కోసం ముందే ఎరువులు,విత్తనాలు తెచ్చి పెట్టినది కేసీఆరేనని… మిషన్ కాకతీయ తో 20 వేల కోట్లు ఖర్చు పెట్టి కాకతీయుల నాటి వైభవం మళ్ళా చూపించమన్నారు.
పల్లె జీవితాలు అభివృద్ధి పరచుకున్నామని…. రైతుబంధు పెట్టి రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news