చంద్రబాబు ఓ నక్క..లోకేష్ ఓ గుంట నక్క : పేర్ని నాని

చంద్రబాబు, నారా లోకేష్‌ పై మరోసారి మంత్రి పేర్ని నాని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. వైఎస్ పులి కాబట్టే ఆయన కడుపున పులి పుడుతుందని… చంద్రబాబు నక్క కడుపున గుంటనక్క లోకేష్ పుట్టాడంటూ ఫైర్‌ అయ్యారు ధైర్యం, సాహసం, సంకల్పం అంటే జగన్ అని.. కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు కుట్రలు పన్ని జైలు పాలు చేస్తే …జగన్ బెదరలేదని గుర్తు చేశారు.

perni nani

ఇవాళ 151 ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రిగా ఉన్నారని… అయినా తండ్రి, కొడుకు లకు బుద్ధి రావటం లేదని మండిపడ్డారు. పేదవారికి అమరావతి ప్రాంతంలో ఇళ్ళు ఇస్తామని ప్రభుత్వం చెబితే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని అడ్డుకున్న వాళ్ళు రైతులు ఎలా అవుతారు? నిజమైన ఏ రైతన్న ఈ రకంగా ఆలోచిండన్నారు.

లోకేష్… చంద్రన్న దేవుడు అంటున్నాడని.. ఎవరికి దేవుడు? అని ప్రశ్నించారు పేర్ని నాని. లోకేష్ ను మానసిక వైద్యులకు చూపించాలని… కుప్పంలో ఓటుకు 1500, 2000 రూపాయలు ఓటర్లకు ఇస్తు లోకేష్ తిరుగుతుందన్నది వాస్తవం కాదా?? అని నిప్పులు చెరిగారు. 1989 నుంచి ఇప్పటి వరకు కుప్పానికి చంద్రబాబు ఎమ్మెల్యేనే కదా…హంద్రీనీవా ఎందుకు తీసుకుని రాలేదని మండిపడ్డారు. రెండేళ్లల్లో ఏం పీకార్రా…అని లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.