టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆయన బిజెపి నుండి హుజురాబాద్ బరిలో నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థి పై గెలిచారు. అయితే తాజాగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ ఆ పార్టీ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కూతురు వివాహానికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. పద్మారావు గౌడ్ మాజీ స్పీకర్ గా కూడా పనిచేశారు. అయితే తాజాగా సికింద్రాబాద్ లో ఆయన కూతురి వివాహం జరిగింది. ఈ వివాహానికి బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పద్మారావు గౌడ్ ఈటెలను మర్యాద పూర్వకంగా పలకరించారు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనుకున్నారో ఏమోగానీ ఈటెల రావడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా పద్మారావు గౌడ్ కూతురు వివాహానికి సీఎం కేసీఆర్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ సహాపలువురు నేతలు హాజరయ్యారు.