రాష్ట్ర ప్రభుత్వ అధికారం అంతా ఇంటికే పరిమితమైంది- కాంగ్రెస్ నేత మల్లు బట్టి విక్రమార్క

-

ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ నేత మల్లు బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంల అంతా ఇంటికే పరిమితమైందని.. ఇంటికి వెళ్లిన వారికి మాత్రమే పనులు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనాల్సిన వాళ్లే రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని ఎద్దెవా చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కాకుండా ధాన్యం కొనేవారు ఎవరని ప్రశ్నించారు. రైతు సమస్యలపై రాజకీయాలు చేస్తూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పబ్బం గడుపుతున్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి రైతుల్ని ఫుట్ బాల్ అడుతున్నాయన్నారు బట్టి. మాకు పాలన చేత కాదని చెప్పి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రోడెక్కాయని విమర్శించారు. సమన్వయంతో పరిపాలన చేయాల్సిన వాళ్లే పోటాపోటీగా రోడెక్కుతున్నారన్నారు. మనం పండించిన పంట కొనేదాకా పోరాడదాం అన్నారు.

కేంద్రం ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్తులను అమ్మి వ్యవస్థను కుప్పకూలుస్తున్నారని బట్టి విక్రమార్క అన్నారు. జై జవాన్..జై కిసాన్ నినాదంలో నడిచిన దేశం ఇదని, ప్రస్తుతం జవాన్ లేడని, కిసాన్ కూడా లేకుండా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news