హైదరాబాద్‌ సొమ్ము అనుభవిస్తూ.. సోకులు పడుతున్నారు : టీఆర్ఎస్ కు పేర్ని నాని కౌంటర్

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి పేర్నినాని కౌంటర్‌ ఇచ్చారు. మాకు రావాల్సిన నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నామని… మాటి మాటికి ఢిల్లీ వెళుతున్న కేసీఆర్‌ ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళుతున్నారని ప్రశ్నించారు పేర్ని నాని. బయట కాలర్‌ ఎగరేసి.. లోపల కాళ్లు పట్టుకునే అలవాటు సీఎం జగన్‌ కు లేదని టీఆర్‌ఎస్‌ పార్టీ కి చురకలు అంటించారు.

ఎవరితోనైనా.. స్నేహమంటే స్నేహం.. ఢీ అంటే ఢీ అనేదే సీఎం జగన్‌ నైజమని స్పష్టం చేశారు పేర్ని నాని. తెలంగాణ సర్కార్‌ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయంటున్నారని… కాంట్రాక్టర్లకు ఎంత బకాయిలు ఇవ్వాలో అడగండని పేర్ని నాని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం లో అందరూ కలిసి అభివృద్ధి చేసి… హైదరాబాద్‌ సోమ్మును అనుభవిస్తున్నారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ అనుభవిస్తూ… సోకులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని నాని. ఇక అంతుకుముందు… తెలంగాణ సొమ్ము దోచుకున్న ఆంద్రోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అయితే.. దీనికి పేర్ని నాని తాజాగా కౌంటర్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news