గేదె పాలు ఇవ్వ‌డం లేద‌ని ఏకంగా పోలీస్ స్టేష‌న్ కే..

-

సాధార‌ణంగా పోలీస్ స్టేష‌న్ కు మ‌నం ఎదైన స‌మ‌స్య ఉంటే వెళ్తం. ఎదైనా దొంగ‌త‌నం జ‌రిగితే.. ఎవ‌రైన మ‌న పైన దాడి చేస్తే మ‌నం పోలీస్ స్టేష‌న్ కు వెళ్తం. కానీ మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఒక వింత సంఘ‌ట‌న జ‌రిగింది. తన గేదె కొన్ని రోజులుగా పాలు ఇవ్వడం లేదని పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి ఫీర్యాదు చేశాడు. మ‌ధ్య ప్ర‌దేశ్ లోని బింద్ జిల్లాలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

బాబూలాల్ జాత‌వ్ అనే వ్య‌క్తి న‌యాగావ్ పోలీస్ స్టేష‌న్ కి త‌న గేదె ను తీసికెళ్లి ఫీర్యాదు చేశాడు. అలాగే త‌న గేదె పాలు కూడా తనని పితకనివ్వడం లేదని త‌న ఫీర్యాదు లో తెలిపాడు. తన గేదెకు గ్రామంలో ఎవరో చేతబడి చేశారని అన్నారు. అందుకే పాలు ఇచ్చేందుకు గేదె నిరాకరిస్తోందని ఫిర్యాదు లో తెలిపాడు. చేశాడు. పోలీసు ల‌కు ఫీర్యాదు చేసిన నాలుగు గంట‌ల త‌ర్వాత జాత‌వ్ మ‌ళ్లి గేదె తో వ‌చ్చి త‌న‌కు స‌హాయం చేయాల‌ని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఒక ప‌శు వైద్యుని ద‌గ్గ‌ర‌కు ఆయ‌న‌ను పంపిచారు. అయితే చివ‌రకి ఆ గేదె పాలు ఇవ్వ‌డం తో మళ్లి పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చి పోలీసుల‌కు ధ‌న్య వాదాలు తెలిపాడు. కాగ ప్ర‌స్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news