మన ఆహారపు అలవాట్ల వల్లనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే..కానీ ఈ బిజీ జీవనశైలీలో డైలీ పోషణవిలువలు ఉండే ఆహారం తినటం అంటే కుదిరేపనికాదు..ఏదోఒకటి బాక్సులో వేసుకుని వెళ్లిపోవటమే అవుతుంది. అయితే ఈమధ్యకాలంలో పైల్స్ సమస్య వేధిస్తోంది. ఇది వంశపారపర్యంగా వచ్చే వ్యాధి అయినప్పటికీ..లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ఇప్పుడు ఇది అందరికీ వచ్చే వ్యాధి అయిపోయింది. ఈరోజు పైల్స్ నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
పైల్స్ రావడానికి ప్రధాన కారణం కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాలు, జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలో వేపుళ్లు అతిగా తినడం, మాంసాహరం తరుచుగా తినటం వలన పైల్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
పైల్స్ ఉన్నప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి.
తీవ్రమైన తలనొప్పి.
మంట, మలవిసర్జన సాఫీగా జరుగదు.
మలంలో రక్తం పడడం, మలవిసర్జన అనంతరం కూడా కొద్దిగా నొప్పి మంట ఉంటుంది.
ఇంకా ఈ సమస్య ఎంత బాధిస్తుందో అందరికీ తెలిసిన విషయం..దాని గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.
ఈ ఆహార పదార్థాలను తినటం వలన పైల్స్ ను నివారించుకోవచ్చు.
1. అంజీర పండు: మలబద్ధకం సమస్యను తగ్గించడానికి అంజీర పండు చక్కగా పనిచేస్తుందట. అంజీర పండ్లు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తింటే మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఈ నీటిని రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం తాగితే పైల్స్ వ్యాధి నయమైపోతుంది.
2. దానిమ్మ: దానిమ్మ పైల్స్ నివారణకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించాలి. ఇలా బాగా మరిగించి ఉడికించిన నీటిని వడగట్టి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. ఇలా చేయడంతో పైల్స్ సమస్యకు దూరంగా ఉండవచ్చు.
3. పచ్చి ఉల్లిపాయ రసం: పచ్చి ఉల్లిపాయ జ్యూస్ ను క్రమం తప్పకుండా వాడటంతో మలంలో రక్తం పడటాన్ని నివారించవచ్చు. దీంతో నొప్పి తగ్గుతుంది. పైల్స్ సమస్యలను మొదట్లోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం
4. అల్లం నిమ్మరసం జ్యూస్: అల్లం , నిమ్మరసం తేనె కలిపిన జ్యూస్ ను రోజూ తీసుకుంటే పైల్స్ ను బారినుంచి తగ్గించుకోవచ్చు. పైల్స్ రావడానికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణం కావచ్చు. ఈ జ్యూస్ శరీరంలో డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. దాంతో పైల్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇది క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇలా మీకు సులభంగా అనిపించింది సమస్య ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి. అయినా పైల్స్ సమస్య బాధించకముందే..కాస్త వేడిచేసే ఆహారపదార్థాలను తగ్గించుకోవటం మంచిది.