టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ కీలక బాధ్యతలు చేపట్టడానికి సిద్ధం అవుతున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని తాజా గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి అధికారికంగా ప్రకటించాడు. అయితే ఎన్‌సీఏ ఛీప్ గా ఇప్పటి వరకు రాహుల్ ద్రావిడ్ ఉండే వాడు. అయితే రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ గా నియమకం కావడం తో ఎన్‌సీఏ ఛీప్ పదవి ఖాళీ గా ఉంది.
దీంతో ఈ ఖాళీని టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తో పూర్తి చేశారు. అయితే మొదట ఈ ఎన్‌సీ హెడ్ గా ఉండటానికి వీవీఎస్ లక్ష్మణ్ అంగీకరించ లేదు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి, బీసీసీఐ సెక్రటరీ జై షా తో వీవీఎస్ లక్ష్మణ్ సమావేశం అయిన తర్వాత ఎన్‌సీఏ బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించాడు. అయితే ఈ బాధ్యతలను త్వరలోనే వీవీఎస్ లక్ష్మణ్ స్వీకరించనున్నాడు. అయితే ప్రస్తుతం టీమిండియా కు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు అందరూ కూడా మాజీ ఆటగాళ్లే కావడం విశేషం.