కొచ్చిన్ షిప్ యార్డ్ లో రూ. 50 వేల వేతనంతో ఉద్యోగాలు.. వివరాలు మీకోసం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా భారత ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 70 ఖాళీలు వున్నాయి.

jobs
jobs

దరఖాస్తుకు డిసెంబర్ 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 19 నుంచి ప్రారంభమైంది. ఇక ఖాళీల వివరాల లోకి వెళితే.. సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 14, ప్రాజెక్ట్ ఆఫీసర్లు 56 ఖాళీలు వున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు సంబంధించిన విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసుండాలి. ఇక వయస్సు విషయం లోకి వస్తే.. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 03 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. శాలరీ విషయంలోకి వస్తే.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 47 వేలు, రెండో ఏడాది నెలకు రూ. 48 వేలు, మూడో ఏడాది నెలకు రూ. 50 వేల వేతనం ఇస్తారు.

అదే ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకైతే సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. వయస్సు డిసెంబర్ 03 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. శాలరీ వచ్చేసి రూ. 37 వేలు, రెండో ఏడాది రూ. 38 వేలు, మూడో ఏడాది నెలకు రూ. 40 వేల వేతనం ఇస్తారు. ఈ కింద లింక్ ద్వారా అప్లై చేసుకోండి. https://cochinshipyard3.azurewebsites.net/#no-back-button

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news