శనగలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం పూట నానబెట్టిన శనగలు తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సమయంలో శనగలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.
ప్రతిరోజు రాత్రి శనగలు నీళ్లల్లో నానబెట్టి ఉదయాన్నే వాటిని తింటే చాలా మంచిది. అయితే అతిగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి మొదలైన సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం శనగలలో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇక ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.
ప్రోటీన్ మరియు ఐరన్:
ప్రోటీన్ పొందడం అంటే శాఖాహారులకు చాలా కష్టమైన పని. అయితే శెనగలు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రొటీన్లు అందుతాయి. అదేవిధంగా ఎనీమియా సమస్యతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు శెనగలని తీసుకుంటే మంచిది. ఎందుకంటే శనగల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెమోగ్లోబిన్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
జీర్ణ సమస్యలు తగ్గుతాయి:
శెనగలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా మేలు చేస్తుంది. అజీర్తి, కాన్స్టిపేషన్ మొదలైన సమస్యల నుండి బయట పడేస్తుంది.
నీరసం తగ్గుతుంది:
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. బరువు తగ్గడానికి అవుతుంది అలానే మంచిగా ఎనర్జీ పొంది నీరసం వంటి సమస్యలు లేకుండా ఉండొచ్చు.
కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి:
శెనగలు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతాయి. దీనితో హృదయ సంబంధిత సమస్యలు కూడా ఉండవు. ఇలా ఇన్ని ప్రయోజనాలను మనం వీటితో పొందొచ్చు.