తెలంగాణ ప్రజలకు శుభవార్త..త్వరలోనే పల్లె దవాఖానలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు శుభవార్త చెప్పారు. ప్రజలకు వైద్య సేవ చేయడం అదృష్టంగా భావించాలని.. అతి త్వరలోనే.. ప్రతీ పల్లె.. పల్లె దవాఖానలు తీసుకువస్తున్నట్లు హరీష్‌ రావు ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌ రావు ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చిన్నకోడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మంది ఆశా కార్యకర్తలకు జియో 4జీ మొబైల్ సిమ్ కార్డుల పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి కావాలని….ప్రోగ్రామ్ ఆఫీసర్లను నియమించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మండలం, గ్రామం వారీగా వ్యాక్సినేషన్ పై డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ప్రజలను ఆరోగ్యంగా కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని… ప్రజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఓపికతో పని చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి పిలుపు ఇచ్చారు హరీష్‌ రావు. నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని… ప్రజలకు ప్రభుత్వ వైద్యం చేరువలో తేవాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ విజన్ కు అనుగుణంగా భవిష్యత్తులో ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు తెస్తామని వెల్లడించారు. ప్రతీ పల్లె ప్రాథమిక ఉప కేంద్రంలో స్టాఫ్ నర్సు, ఏఏన్ఏఎంలు, వైద్యులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news