కంప్యూటర్ టీచింగ్ స్కిల్స్ పై ఆన్లైన్ కోర్స్..!

-

ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్‌ల కోసం కంప్యూటర్ సైన్స్‌లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్స్ వర్చువల్ విధానంలో ఉంటుంది. బీఈ/ బీటెక్ అండ్ నాన్- ఇంజ‌నీరింగ్ విభాగాలు బీఎస్సీ/ బీసీఏ / ఎంసీఏ వాళ్ళకి హెల్ప్ అవుతుంది.

ముఖ్యంగా కంప్యూట‌ర్ సైన్స్ విభాగాల్లో ఉపాధ్యాయులు బోధ‌నా సామర్థ్యాలు మెరుగు ప‌ర్చుకొనేందుకు ఈ కోర్సుని తీసుకు రావడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ కోర్సు ద్వారా స్కిల్స్ ని పెంపొందించుకోచ్చు. ఈ స‌ర్టిఫికెట్ ప్రొగ్రాం ఉపాధ్యాయులు వృత్తిప‌రంగా మెరుగ్గా రాణించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుందిన ఐఐఐటీ ఢిల్లీ అంది.

కోర్సు మొద‌టి మాడ్యూల్ జ‌న‌వ‌రి 2022న ప్రారంభ‌మ‌వుతుంది. వారానికి 6 నుంచి 8 గంట‌ల పాటు టీచింగ్ ఉంటుంది. ఈ కోర్సు బోధించేందుకు ఆయా రంగాల్లో స్పెష‌లిస్టుల‌ను ఎంపిక చేసి బోధ‌న అందించ‌స్తారు. ఈ కోర్సులో ప్రతీ మాడ్యూల్ ధర రూ. 10,000 అద‌నంగా జీఎస్‌టీ చెల్లించాలి. ఇక దరఖాస్తు విధానం గురించి చూస్తే…

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://csedu.iiitd.ac.in/ ను ఓపెన్ చెయ్యాలి.
ప్రోగ్రామ్ వివ‌రాలు.. ఫీజు మొత్తం అన్నీ చూసుకున్నాక
Express Your Interest ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు అక్కడ అప్లికేష‌న్ ఫాంలో అన్ని వివరాలు న‌మోదు చేయాలి.
ఇక్కడ మీరు కంప్యూట‌ర్ సైన్స్‌లో ఏ ప్రోగ్రాం చ‌ద‌వాల‌నుకోవాల‌నుకొంటున్నారో ఆప్ష‌న్ ఎంకొవాలి.
ద‌ర‌ఖాస్తు పూర్తి చేసి స‌బ్‌మిట్ చేయాలి అంతే.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news