ఓంకారంలో అకార, ఉకార, మకార శబ్ధాలు కలిగి ఉంటాయి. ఓంకారాన్ని త్రిమూర్తి స్వరూపం అని కూడా అంటూ ఉంటారు. చాలా మంది ప్రతి రోజూ ఓం అని జపిస్తూ ఉంటారు. అయితే ఓం అని జపించడం వల్ల చాలా చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు అని పండితులు అంటున్నారు. మరి ఆయా ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మానసిక శాంతి కలగడం, పాజిటివ్ ఎనర్జీని పొందడం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఓంకారంతో మనం పొందొచ్చు. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు 108 సార్లు ఓం అని చెప్పడం వల్ల ఎంతో అద్భుతమైన ప్రయోజనాలు మనం పొందొచ్చు.
ఈ సమయాన్ని శుభసమయం అని పిలుస్తారు. నెలకి 1008 సార్లు ఓం అనే పదాన్ని జపిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. కడుపు నొప్పి సమస్యతో బాధపడే వాళ్లకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలు మీ నుండి దూరమవుతాయి కూడా.
మీ వీలునుబట్టి రోజుకి ఎన్నిసార్లు అయినా జపించచ్చు. సంతోషంగా ప్రశాంతంగా ఉండడానికి కూడా కుదురుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి మీ నుండి దూరం అయిపోతాయి. ఇలా ఓం అనే పదంతో ఇంత మేలు మనం పొందొచ్చు.