తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు కనిపించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలకు గానూ 6స్థానాలలో టిఆర్ఎస్ ఏకగ్రీవం అయ్యింది. నిన్నటితో 12 స్థానాలకు నామినేషన్ ల ఉపసంహరణ గడువు పూర్తయ్యింది. వాటిలో ఆరు స్థానాలకు టిఆర్ఎస్ అభ్యర్థులే మిగిలారు. దాంతో 6స్థానాలు ఏకగ్రీవంగా నిర్ధారించారు. ఇక ఏకగ్రీవం అయిన వారిలో ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ గా కవిత ఏకగ్రీవం అయ్యారు. కవిత తో పాటూ…శంబి పూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, కోచికుల్ల దామోదర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. ఇక మిగతా ఆరు స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా టిఆర్ఎస్ ఏకగ్రీవం కోసం చాలా ప్రయత్నాలు జరిపినట్టు తెలుస్తోంది. కానీ ప్రత్యర్థులు తగ్గక పోవడం తో పోటీ తప్పలేదు అని అయా జిల్లాల్లో చర్చ జరుగుతోంది.