కొత్తగా పెళ్లయిన వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వం రూ.612.50 కోట్ల నిధులను విడుదల చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి బడ్జెట్ లో రూ.1850 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ.925 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కాగా తాజాగా మూడో త్రైమాసికానికి రూ. 462.50 కోట్లను సర్కార్ విడుదల చేసింది. ఇక షాదీ ముబారక్ పథకం కోసం 300 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
కాగా ముందుగా 150 కోట్లు విడుదల చేయగా మిగిలిన 150 కోట్లను విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఆడపిల్లల పెళ్లి కోసం తెలంగాణ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద లక్ష నూట పదహారు రూపాయల చొప్పున పెళ్లికూతురు కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. హిందువులకు కళ్యాణ్ లక్ష్మీ పేరుతో ఈ పథకాన్ని అందిస్తుండగా ముస్లింలకు షాదీముబారక్ పేరుతో అందజేస్తుంది. పెళ్లి సమయంలో ఉండే ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సర్కారు ఈ పథకాలను ప్రారంభించింది.