ఒమిక్రాన్ బయటపడ్డ దేశాలకు రాకపోకలు ఆపండి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

-

అత్యంత ప్రమాదకరమైన, భయంకరమై ఒమిక్రాన్ వేరియంట్ బటయపడ్డ దేశాలకు రాకపోకలు నిలిపివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. అతి కష్టంపైన మన దేశం కొవిడ్-19 మహమ్మారి నుంచి బయటపడుతున్నది. కొత్త వేరియంట్ భారతదేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. అందుకోసం కొత్త వేరియంట్ బయటపడ్డ దేశాలకు రాకపోకలు నిలిపివేయండి అని ట్విట్టర్ వేదిక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను గురువారం శాస్త్రవేత్తలు కొనుగొన్న విషయం విధితమే. ఆ తర్వాత మరికొన్ని దేశాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి. బొట్సావానా, హాంగ్ కాంగ్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌ను కనుగొనగా తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలో కూడా కొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news