సీఎం జగనుకి బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఏక గ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న ప్రొత్సహాకాలను ఎందుకివ్వడం లేదని లేఖలో ప్రశ్నించారు సోము వీర్రాజు. పంచాయతీ నిధులకు పారదర్శకత ఏది..? ఏకగ్రీవ పంచాయతీ పాలక మండళ్ళకు ప్రోత్సాహక నగదు ఏది..? అంటూ నిలదీశారు సోము వీర్రాజు.
జీవో విడుదల చేసి నవ మాసాలు నిండినా అమలు చేయరా..? పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే గతంలో వేలల్లో ఉండే ప్రోత్సాహకాన్ని లక్షల్లోకి మార్చారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం జనాఙా ప్రాతిపదికన రూ. 5 నుంచి రూ. 20 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారని.. 2,199 పంచాయితీలు ఏకగ్రీవం చేసుకుంటే కనీసం నయాపైసా ప్రోత్సాహకం అందించలేదని మండిపడ్డారు. మాట తప్పను, మడమ తిప్పననే సీఎం జగన్.. పంచాయతీలకు ప్రొత్సహాకాలను వెంటనే విడుదల చేయాలని.. ప్రోత్సాహకాల విడుదల చేసిన ఉత్తర్వులు ఉత్తుత్తివి కాదని నిరూపించాలని గుర్తు చేశారు సోము వీర్రాజు.