కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో డాక్టర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్ కి కార్తీక్, దీప వస్తారు. భారతి, తన భర్త రవి వచ్చి కంగ్రాస్ట్ చెప్తే నాకెందుకో వద్దు అనిపిస్తుంది అంటాడు కార్తీక్. అలా అనొద్దు అని ఏదో ఒకటి చెప్తాడు. కట్ చేస్తే మీటింగ్ స్టాట్ అవుతుంది. భారతీ స్పీచ్ ఇస్తుంది. ఏకగ్రీవంగా ఎన్నకున్నాం అని..కార్తీక్ గురించి పొగుడుతూ ఉంటుంది. కార్తీక్ ఇక ఆపవా భారతి అంటే..సరే ఆపేస్తున్నాను..కొడుకు గురించి నాలుగు మాటలు మాట్లాడాల్సిందా కోరుతున్నాను అని సౌందర్యను స్టేజ్ పైకి పిలుస్తుంది. సౌందర్య వెళ్లి స్పీచ్ ఇస్తుంది. కార్తీక్ గురించి పొగుడుతూఉంటుంది. చిన్నతనంలో కార్తీక్ చేసిన అల్లరిపనులు చెప్తూ ఉంటుంది..ఇంకోకసారి ఏం జరిగిందంటే అని చెప్పబోతుంది. ఇంతలో ఈ రాక్షసి మోనిత ఎంట్రీ ఇస్తుంది. మీకంటే నేనే బాగా చెప్తాను కార్తీక్ గురించి అంటుంది. డాక్టర్ కార్తీక్ గారి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తాను అంటుంది. సౌందర్య ఒక వ్యక్తి గురంచి బాగా తెలిసేది..తల్లిదండ్రులకు, బాల్యస్నేహితులకు ఆ తర్వాత సతీమణికి అంటుంది..నా తర్వాత కార్తీక్ గురించి కార్తీక్ భార్య దీప మాట్లాడుతుంది అని దీపను స్టేజ్ మీదకు పిలుస్తుంది. దీప లేస్తుంది. ఇంతలోనే ఆ మోనిత స్పీడ్ గా వచ్చి నేను మాట్లాడుతాను అంటూ.సౌందర్యను పక్కకు పెట్టి మోనిత పోడియం దగ్గర నుల్చుంటుంది.
మోనిత స్పీచ్ స్టాట్ చేస్తుంది. వెకిలినవ్వు నవ్వుతూ..డాక్టర్లు కాని వాళ్లను ఎందుకు పిలిచావు భారతి అంటుంది. సౌందర్య గారు కార్తీక్ గురించి వారి భార్యకు తెలుస్తుంది అని చెప్పారు..కానీ కార్తీక్ కు పెళ్లైన కొన్నాళ్లకే వాళ్లు విడిపోయారు..పదకొండేళ్లు దూరమై..ఈ మధ్యే కలిశారు అంటుంది. కార్తీక్ వెళ్లిపోదాం అనుకుంటే..దీప ఆపుతుంది. భారతి మోనితను ఆపమంటే..ఎందుకు ఆపాలి, ఒక డాక్టర్ గా మాట్లాడుతున్నాను, కార్తీక్ ప్రేయసిగా మాట్లాడతాను, కార్తీక్ బిడ్డకు జన్మనిచ్చన తల్లిగా మాట్లాడతాను అంటుంది. ఇక్కడున్న మీ అందరికి ఏమీ తెలియదని నేను అనుకోను..మా ఇద్దరి గురించి టీవీల్లోనూ, పేపర్లోనూ వచ్చాయి. వచ్చిన దాంట్లో నిజనిజాలు తెలియవుకదా..అది చెప్పడానికి వచ్చాను అంటుంది. కార్తీక్ లేస్తే మోనిత ప్లీజ్ కుర్చో..నీ ముందే నిజాలు చెప్తాను, అందులో ఏదైనా అబద్ధం ఉంటే నువ్వే చెప్పు..కుర్చో కార్తీక్ తప్పించుకుని వెళ్లొద్దు అంటుంది మోనతి. ఇక కార్తీక్ అక్కడ కుర్చిండిపోతాడు.
నాకు న్యాయం చేస్తేనే..కార్తీక్ ప్రసిడెంట్ గా కొనసాగుతాడు అంటుంది మోనిత. రవి లేచి ఇది పర్సనల్ ఫంక్షన్ కాదు..డాక్టర్ అసోసియోషన్ మీటింగ్ అంటాడు. కద రవి..డాక్టర్లకు సమస్య వస్తే న్యాయం చేయటమే కదా ప్రసిడెంట్ బాధ్యత అంటుంది. మోనిత తన ప్రేమ కథను మళ్లీ మొదలేస్తుంది. పెళ్లి చేసుుకుంటా అన్నాడు.పీటల మీద పెళ్లి ఆగిపోయింది అంటూ ఏమోషనల్ యాక్టింగ్ చేస్తుంది. అసలు ఇదంతా చూస్తుంటే ప్రేక్షకులకు కూడా చిర్రెత్తుకొస్తుంది. అంతమంది ఉన్నారు..ఆ మోనిత పక్కకు లాగేదానికి..బుర్రకథ విన్నట్లు వింటున్నారు అంతా. ఇదే ఛాన్స్ అని మోనిత ఏడ్చుకుంటూ ఇంకా సోది చెప్తూనే ఉంటుంది..దిక్కుతోచని పరిస్థితుల్లో నా ప్రేమను చంపుకోలేక.ఆర్టిఫీషియన్ ఇన్సమ్యూనేషన్ తో కార్తీక్ బిడ్డకు తల్లిని అయ్యాను, డెలివరీటైంలో ఆఫరేషన్ కోసం నా భర్తగా సంతకం చేశాడు..ఇదిగో ఆ పేపర్ కాపి అని చూపిస్తుంది., పేగు మెడలో వేసుకుని పుట్టాడని వీళ్ల అమ్మగారు అడిగితే వెళ్లాను పూజచేసినప్పటి ఫోటోలు ఉన్నాయి అని అందరికి చూపిస్తుంది. కార్తీక్ వల్ల కలిగిన కొడుకు అక్కడ ఉన్నాడని చూపిస్తుంది.
మీరే చెప్పండి..తన బిడ్డను నా ప్రేమను అంగీకరించటం లేదు, నాకు న్యాయం చేయండి అంటూ మొరపెట్టుకుంటుంది. నేను ఏం చేసిన కార్తీక్ గారి మనసు కరగటంలేదు, నన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు అంటుంది. మీరే న్యాం చేయండి అంటుంది. దీప సీరియస్ గా చూస్తుంది. మోనిత ఏడుస్తుంటే..దీప మాత్రం క్లాప్స్ కొడుతుంది. అందరూ షాక్ అవుతారు. దీప మోనితను పక్కకు లాగి పోడియం దగ్గర నిలబడుతుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయిభాగంలో బయటకి వస్తున్న కార్తీక్ కుటుంబంని చూసి మోనిత రెచ్చగొడతుంది. కార్తీక్ కొట్టడానికి మీదకు వెళ్తే..సౌందర్య ఆపుతుంది. అయినా ఈ మోనిత ఆగదు..నీకు ఆడపిల్లను ఉన్నారు.. నా శపం తగులుతుంది అంటుంది. అంతే జెట్ స్పీడ్ లో దీప మోనిత మీదకు వెళ్తుంది. కొడుతుందో లేదు మరి..రేపు చూడాలి.
– Triveni Buskarowthu