చలికాలంలో నువ్వుల వలన ఎన్ని లాభాలు పొందచ్చంటే..?

-

నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చలికాలంలో నువ్వులను తీసుకోవడం వలన ఎన్నో బెనిఫిట్ పొందొచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాన్స్టిపేషన్ మొదలు చాలా సమస్యలు తరిమికొట్టడానికి నువ్వులు మనకి సహాయపడతాయి.

చలికాలంలో నువ్వులు తీసుకోవడం వల్ల ఎనర్జీని మళ్లీ తిరిగి పొందడానికి అవుతుంది. నల్ల నువ్వులుని నమిలి ఆ తర్వాత నీళ్లతో వాటిని మింగేస్తే హెమర్హాయిడ్స్ సమస్య నుండి బయట పడవచ్చు. అయితే చలికాలంలో నువ్వులను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఆలస్యమెందుకు ఇప్పుడే పూర్తిగా చూద్దాం.

దగ్గు, చెవి నొప్పి తగ్గుతుంది:

చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్య దగ్గు. దగ్గు నుండి బయటపడడానికి నువ్వులు మనకి సాయం చేస్తాయి. నువ్వులతో పాటు కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే చెవి నొప్పి తో బాధపడే వాళ్ళు నువ్వుల నూనెలో వెల్లుల్లి వేసి దానిని చెవిలో వేయడం వల్ల చెవినొప్పి నుండి వెంటనే రిలీఫ్ పొందొచ్చు.

హార్ట్ ఎటాక్ రిస్క్ ఉండదు:

నువ్వులను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అలానే మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయం చేస్తుంది. అదేవిధంగా నువ్వులు హృదయ సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ నుండి దూరంగా ఉండొచ్చు.

జుట్టు రాలడం తగ్గుతుంది:

నువ్వులు జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల నూనె తలకు రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలానే జుట్టు నల్లగా ఉంటుంది.

అందంగా ఉండొచ్చు:

అందమైన చర్మం కోసం నువ్వులు బాగా హెల్ప్ చేస్తాయి. నువ్వులని పాలల్లో వేసి పేస్టులాగ చేసి దానిని ముఖానికి అప్లై చేసుకుంటే మరింత అందంగా మీరు మారచ్చు. ఇలా నవ్వులతో ఎన్నో అద్భుతమైన లాభాలను మనం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news