మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే..
దీనిలో మొత్తం 15 ఉద్యోగ ఖాళీలు వున్నాయి. పోస్టుల వివరాలని చూస్తే.. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (03), కంప్యూటర్ ఆపరేటర్ (10), డేటా ఎంట్రీ ఆపరేటర్ (02) ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇక అర్హత వివరాల లోకి వెళితే.. బీటెక్ పాసైన వాళ్లు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు అర్హులు.
అలానే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు డిగ్రీ (కంప్యూటర్స్) లేదా ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ పూర్తి చేసి ఉండాలి. అలానే రెండేళ్ల అనుభవం ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలకు అప్లై చెయ్యాలంటే ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ పాసై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా రెండేళ్ల అనుభవం తప్పనిసరి. మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అప్లై చెయ్యడానికి చివరి తేదీ 2021 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ. http://ntruhs.ap.nic.in/index.html వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను చూడచ్చు.
డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పక్కన, విజయవాడ-520008, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.