ఈటెల రాజేందర్ జమునా హెచరీస్ పై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మెదక్ జిల్లా కలెక్టర్ ఈటెల ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లు నివేదికి ఇచ్చారు. మరోవైపు ఈటెల సతీమణి జమున, ఈటెల రాజేందర్ మాత్రం ప్రభుత్వమే తప్పుడు కేసులు పెడుతుందని ఆరోపిస్తున్నారు.
తాజాగా ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ బాల్కసుమన్ ఈటెల రాజేందర్ పై ఫైరయ్యారు. ఈటెల దగాకోరు అని.. ప్రభుత్వ భూములను దిగమింగాడు అని తీవ్రస్థాయిలో విమర్శించాడు. 70.33 ఎకరాలను కబ్జా చేసినట్లు కలెక్టర్ తేల్చారని వెల్లడించారు. రైతుల భూములను రైతులకు, ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి ఈటెల రాజేందర్ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ భూములను కబ్జా చేసినట్లు కలెక్టర్ తేల్చారని అన్నారు. ఈటెల రాజేందర్ కబ్జాల విషయంలో ఇప్పటికీ బుకాయించే ప్రయత్ని చేస్తున్నారని..ఇప్పటికైనా ఆయన తప్పు ఒప్పుకోవాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు ఈటెల బలవంతంగా లాక్కున్నారని అన్నారు. వారి భూములను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
పదవుల ఇచ్చినంత సేపు కేసీఆర్ మంచోడని.. పదవులు పోయిన తర్వాత కేసీఆర్ ను చెడ్డోడు చేస్తున్నారని.. బీజేపీలో ఇటీవల చేరిన విఠల్ గురించి వ్యాఖ్యలు చేశారు. విఠల్ ను ఎంతో గౌరవించామని.. టీఎస్పీఎస్సీలో సభ్యుడిగా పదవి ఇచ్చామని గుర్తచేశారు. పార్టీ ఏపదవి ఇచ్చినా… క్రమశిక్షన కలిగిన కార్యకర్తలు కట్టుబడి ఉంటారని బాల్క సుమన్ అన్నారు.